రోగం చిన్నది...వైద్యం పెద్దది
*పేరుకే వనపర్తి ప్రజా వైద్యశాల..అంతా దోపిడీ..*
*రోగం ఒకటైతే.. వైద్యం మరొకటి**
*10. టెస్టులు*
*20ఇంజక్షన్లు*
*26 సేలాన్ బాటిల్*
*లివర్ ఇన్ఫెక్షన్ కి.*
*పేగుకు ఇన్ఫెక్షన్ అని ట్రీట్మెంట్..*
*జబ్బు చిన్నది వైద్యం పెద్దది.*
*రోగికి లేని జబ్బు ఉందని తప్పుడు టెస్టులు.*
*రెండు రోజులకు పదిహేను వేల పైన బిల్.*
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజా వైద్యశాల ప్రైవేట్ ఆస్పత్రి దోపిడీ అంతా ఇంత కాదు ఇటీవలి కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రజల్లో భయం పెరుగుతోంది. వనపర్తి ప్రజా వైద్యశాల ఆసుపత్రి వైద్యులు ఒక మహిళకు లేని రోగానికి ట్రీట్మెంట్ చేసిన వైనం 10 సార్లు ల్యాబ్ టెస్ట్ చేసిన రోగి జబ్బు గుర్తుపట్టని వైద్యులు. రోగం చిన్నదే వైద్యం పెద్దది. లివర్ ఇన్ఫెక్షన్ కు పేగుల ఇన్ఫెక్షన్ అని తప్పుడు ట్రీట్మెంట్ చేసిన ఘటన చర్చనీయాంశమైంది.
పది సార్లు టెస్టులు 20 ఇంజక్షన్లు 26 సెలూన్ బాటిల్ ఎక్కించి రోగులను మోసం వైనం.
వనపర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో తీరు మారడం లేదు వనపర్తి జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య అధికారులు ఉన్నతధికారులు తనిఖీలు లేకపోవడం, నియంత్రణ లోపించడం వల్ల ఇలాంటి దోపిడి పెరుగుతున్నాయి.ఆరోగ్యం కాపాడుకోవడానికే ప్రజలు ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. కానీ.. నేటి వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. ఆసుపత్రి తలుపు తట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వైద్యుడు అంటే విశ్వాసానికి ప్రతీకగా భావించేవారు. కానీ ఇప్పుడు ఏ డాక్టర్ను విశ్వసించాలో. ఏ ల్యాబ్ నివేదికను నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. వనపర్తి ప్రజా వైద్యశాల లో చోటు చేసుకున్న సంఘటన ఈ భయాన్ని మరింత పెంచింది.లేని రోగం ఉందని తప్పుడు వైద్యం చేయడం ఒక మహిళకు లేని రోగాన్ని ఉందని ఆమెను అనవసరంగా చికిత్సలు చేయించుకునేలా మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆ మహిళకు అలాంటి వ్యాధి లేకపోయినా.. భయం సృష్టించి డబ్బు లాగేయడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మోసం బయటపడటంతో ప్రజలలో ఉన్న అనుమానాలు మరింతగా పెరిగినాయి